News March 9, 2025

కూటమి విద్యార్థులను మోసం చేసింది: అవినాశ్

image

ఈ నెల 12వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వైసిపి శ్రేణులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. విద్యార్థులను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అబద్దాలు చెప్పి విద్యార్థులను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

Similar News

News February 23, 2026

కర్ణాటకలో 16 ఏళ్లలోపు వారికి మొబైల్ ఫోన్ నిషేధం?

image

స్మార్ట్ ఫోన్స్ అడిక్షన్ విద్యార్థుల్లో పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 16 ఏళ్లలోపు వారికి ఫోన్‌ వాడకాన్ని నిషేధించాలని యోచిస్తోంది. ఈ అంశంపై అభిప్రాయాలు తెలపాలని అన్ని ప్రభుత్వ వర్సిటీల వీసీలను సీఎం సిద్దరామయ్య కోరారు. ఆస్ట్రేలియాతో సహా పలు దేశాలు ఇప్పటికే విద్యార్థులకు మొబైల్ ఫోన్లను నిషేధించిన అంశాన్ని గుర్తు చేశారు.

News February 23, 2026

నల్గొండ: మైనారిటీల ఆర్థికాభివృద్ధికి గోల్డెన్ ఛాన్స్

image

మైనారిటీల ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రెండు కీలక పథకాల కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జిల్లాలో ఆసక్తి గలవారు మార్చి 1 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.విజయేందర్ రెడ్డి తెలిపారు. వెబ్‌సైట్ :http://tsobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News February 23, 2026

పత్తి కొనుగోళ్ల ప్రక్రియ పొడగింపు: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో సీసీఐ ద్వారా కొనసాగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియ గడువును పొడిగించినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. పత్తి సాగు చేసిన రైతుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులు తమ వద్ద ఉన్న దిగుబడిని ఈ నెల 27లోపు సమీప కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.