News November 4, 2024
కూతురు పుట్టిందన్న ఆనందం.. అంతలోనే విషాదం.!

సత్తెనపల్లిలో ఆదివారం రాత్రి వెన్నాదేవి సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు యడ్లపాడు మండలం లింగారావుపాలెంకు చెందిన రోశయ్య(32)కు వివాహం అయిన నాలుగేళ్లకు కుమార్తె పుట్టింది. ఆనందంతో తన బంధువైన వీరేంద్రతో కలిసి కుమార్తెను చూసి వస్తుండగా గుంటూరు-పిడుగురాళ్ల మధ్యమార్గంలో వారు వెళ్తున్న బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
Similar News
News November 7, 2025
దుగ్గిరాల పసుపు యార్డులో ధరలు ఇలా..!

దుగ్గిరాల యార్డు పసుపుకు పెట్టింది పేరు. అయితే పసుపు యార్డులో ధరలు గురువారం జరిగిన వేలంలో ఈ విధంగా నమోదయ్యాయి. కొమ్ములు క్వింటాకు కనిష్ఠ ధర రూ.10,800, గరిష్ఠ ధర రూ.12,500, మోడల్ ధర రూ.12,500 పలికాయి. కాయ క్వింటాల్‌కు కనిష్ఠ ధర రూ.11,800, గరిష్ఠ ధర రూ.12,400, మోడల్ ధర రూ.12,400 పలకగా, మొత్తం 218 బస్తాల పసుపును రైతులు వ్యాపారులకు విక్రయించారని సిబ్బంది చెప్పారు.
News November 7, 2025
GNT: రచనలను, ఉద్యమాలే ఆయన జీవిత ధ్యేయం

ప్రముఖ అభ్యుదయ సినీ రచయిత, ప్రజా కళాకారుడు, కమ్యూనిస్టు నాయకుడు బొల్లిముంత శివరామకృష్ణ నవంబర్ 27, 1920 సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా చదలవాడలో జన్మించారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో రచనలను, ఉద్యమాలను తన జీవిత ధ్యేయంగా మార్చుకున్నారు. ఆయన రచనల్లో తెలంగాణ సాయుధ పోరాటం, సామాజిక అన్యాయాలు, రైతుల కష్టాలు స్పష్టంగా కనిపిస్తాయి. సినీ రచయితగా ‘నిమజ్జనం’కి జాతీయ అవార్డు లభించాయి.
News November 6, 2025
GNT: పత్తి రైతుల సందేహాల కోసం హెల్ప్‌లైన్

జిల్లాలో గురువారం నుంచి CCI పత్తి కొనుగోళ్లను ప్రారంభించింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశారు. పత్తిలో తేమ 8% మించకపోతే, రైతులకు పూర్తి కనీస మద్దతు ధర (MSP) లభిస్తుందని అధికారులు తెలిపారు. ఆరబెట్టిన పత్తిని మాత్రమే కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం రైతులు 7659954529 హెల్ప్‌లైన్ నంబర్ సంప్రదించాలని సూచించారు.


