News January 1, 2025

కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య

image

భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా బుధవారం శ్రీరామచంద్రుడు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు స్వామివారిని కూర్మావతారంలో అలంకరించి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి నిత్యకళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం వేదపండితులు స్వామివారికి వేద విన్నపాలు సమర్పించారు. ఈకార్యక్రమంలో ఈవో రమాదేవి పాల్గొన్నారు.

Similar News

News January 4, 2025

రూ.690 కోట్లతో మున్నేరు రిటైనింగ్ వాల్: పొంగులేటి

image

దశాబ్దాల నుంచి ఖమ్మం, పాలేరు ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వాగు ముంపు సమస్యకు మరో 7 నెలల్లోగా శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మున్నేరు నది ఒడ్డున ముంపునకు గురవుతున్న నివాస కాలనీలకు శాశ్వత పరిష్కారం చూపుతూ నదీ తీరం వెంబడి రూ.690 కోట్లతో 17km రిటైనింగ్‌వాల్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. జులై 15వ తేదీలోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News January 4, 2025

ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అపోహలొద్దు: పొంగులేటి

image

కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రుద్రంపూర్ ప్రాంతంలో సింగరేణి, అటవీ భూముల్లో సర్వే జరుగుతుందని, అపోహలు నమ్మొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం అమలు చేసిన మా ప్రాంతాలకు రావాలని పట్టుబట్టి సాధించేవరకు నిద్రపోని వ్యక్తి కూనంనేని అని చెప్పారు. కొత్తగూడెం అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి అన్నారు.

News January 3, 2025

కోడి పందేలు నిర్వహిస్తే ఉపేక్షించం: సీపీ

image

కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోడి పందేలను నిషేధించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు పోలీస్ అధికారులతో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని సీపీ అధికారులకు స్పష్టం చేశారు.