News September 1, 2024

కూలర్ రిపేర్ చేస్తుండగా షాక్.. వ్యక్తి మృతి

image

రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలంలోని పల్లూరులో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. ఆవుల రామారావు రిపేర్‌కు వచ్చిన ఓ కూలర్ మరమ్మతులు చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడని గ్రామస్థులు తెలిపారు. ఆపస్మారక స్థితికి చేరుకొన్న అతడిని కోతులగుట్టలోని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మరణించాడు. రామారావుకు ఇంకా వివాహం కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 6, 2024

ఆలమూరు: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

image

ఆలమూరు మండలం చొప్పెల్ల పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని ఆలమూరు ఎస్సై అశోక్ ఆదివారం తెలిపారు. లాకులు దాటిన తర్వాత 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళ మృతదేహాన్ని గుర్తించడం జరిగిందన్నారు. పచ్చ రంగు జాకెట్, బిస్కెట్ కలర్ లంగా ధరించి ఉందన్నారు. ఎత్తు సుమారు 5.2 అడుగులు ఉంటుందని తెలిపారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News October 6, 2024

ఆత్రేయపురం: జాతీయ హ్యాండ్ బాల్ జట్టులో ప్రణీత్ వర్మ

image

జాతీస్థాయి హ్యాండ్ బాల్ జట్టులో ఆత్రేయపురానికి చెందిన ముదునూరి ప్రణీత్ వర్మకు స్థానం దక్కించుకున్నాడు. సీ.బీ.యస్.ఇ సౌత్ జోన్ రాష్ట్రాలు పాల్గొన్న హ్యాండ్ బాల్ పోటీలలో అండర్ -19 విభాగంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ తరపున ముదునూరి ప్రణీత్ వర్మ జట్టుకు ప్రథమ స్థానం లభించిందని స్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు. దీంతో ప్రణీత్ వర్మను గ్రామస్థులు అభినందిస్తున్నారు.

News October 6, 2024

సముద్రంలోకి 1,62,276 క్యూసెక్కుల మిగులు జలాలు

image

రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శనివారం సాయంత్రానికి 1,62,276 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరిందని పేర్కొన్నారు. అలాగే డెల్టా కాలువలకు 14,000 క్యూసెక్కుల నీటిని వదిలామన్నారు.