News February 22, 2025
కూలేందుకు సిద్ధంగా అల్లూరి విగ్రహం

చింతపల్లి మండల కేంద్రంలోని హనుమాన్ జంక్షన్ కూడలి వద్ద అల్లూరి విగ్రహం కూలేందుకు సిద్ధంగా ఉంది. ఈ విగ్రహాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. అల్లూరి విగ్రహం కింద ఉన్న పీఠం పూర్తిగా ధ్వంసమైంది. ఓ వైపు ఒరిగిపోయి కూలేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పీఠం మరమ్మతులు చేపట్టాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.
Similar News
News November 2, 2025
వనపర్తి: బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు

బాల్య వివాహాలు చేస్తే అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరి పై చట్టరీత్య కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదివారం తెలిపారు. అమ్మాయిలు 18 సం. పూర్తి అయ్యే వరకు వారిని కచ్చితంగా చదివించాలన్నారు.18 సంవత్సరాల లోపే పెళ్లి చేస్తే అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
News November 2, 2025
వరంగల్: హరీష్ రావును పరామర్శించిన కొండా మురళీ

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావును మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణరావు చిత్రపటానికి కొండా మురళీ పూలమాల వేసి నివాళులర్పించారు.
News November 2, 2025
రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


