News March 17, 2025
కూల్ డ్రింక్ అనుకొని పురుగు మందు తాగి వృద్ధురాలి మృతి..!

కూల్‌డ్రింక్ అనుకొని పురుగు మందు తాగి వృద్ధురాలు మృతిచెందిన ఘటన ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. పోతుగల్‌కు చెందిన బాలవ్వ (85) శనివారం ఇంట్లోని పురుగు మందును డ్రింక్ అనుకొని తాగి అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు ఆమెను సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదేరోజు రాత్రి మరణించింది. కాగా, 25 రోజుల క్రితమే బాలవ్వ కొడుకు దేవయ్య పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News July 6, 2025
ఇండియన్ మూవీస్.. 6 నెలల్లో రూ.5,360cr+ కలెక్షన్స్!

ఈ ఏడాది తొలి 6 నెలల్లో 856 భారతీయ సినిమాలు థియేటర్లలో రిలీజై ₹5,360కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. గత ఏడాది మొదటి 6 నెలలతో (₹5,260cr) పోలిస్తే ఇది కాస్త ఎక్కువే. తెలుగులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ₹300crకు పైగా వసూళ్లతో టాప్‌లో ఉండగా ఓవరాల్‌గా ‘ఛావా’ ₹800crతో తొలి స్థానంలో ఉంది. ‘గేమ్ ఛేంజర్’ వంటి పెద్ద సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో బాక్సాఫీస్ వద్ద దక్షిణాది సినిమాల హవా కాస్త తగ్గింది.
News July 6, 2025
మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రత్యేక రైళ్లు.!

దక్షిణ మధ్య రైల్వే మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ మీదుగా ఈనెల 9 నుంచి సెప్టెంబర్ 25 మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 07717 (తిరుపతి- హుసూర్), 07718 (హుసూర్- తిరుపతి), 07653 (కాచిగూడ- తిరుపతి), 07654 (తిరుపతి- కాచిగూడ), 07219 (నరసాపూర్- తిరువన్నామలై), 07220 (తిరువన్నామలై- నరసాపూర్) ప్రత్యేక రైలు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
News July 6, 2025
స్కూళ్లకు కీలక ఆదేశాలు

AP: విద్యార్థులు 3 రోజులకు మించి స్కూళ్లకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. 5 రోజుల కంటే ఎక్కువ బడికి రాకపోతే MEO, CRPలు ఆ విద్యార్థి ఇంటికి వెళ్లాలని సూచించింది. టీచర్లు, విద్యార్థుల హాజరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపింది. టీచర్లు సెలవు పెడితే వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని అకడమిక్ పర్యవేక్షణ అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది.