News January 13, 2025
కూసుమంచిలో 30 రోజుల్లోనే ఇందిరమ్మ మోడల్ ఇల్లు పూర్తి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ప్రతీ మండలంలో ఒక నమూనా ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాగా గత నెల 13న మంత్రి పొంగులేటి కూసుమంచి ఎమ్మార్వో ఆఫీసు దగ్గర ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా నెల రోజుల్లోనే పూర్తి చేశారు. రాష్ట్రంలోనే తొలి నమునా ఇల్లు కూసుమంచిలో అందుబాటులోకి వచ్చింది. రూ.5లక్షలతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు కాంట్రాక్టర్ జీవన్ రెడ్డి తెలిపారు.
Similar News
News January 14, 2025
ఖమ్మం శివారులో మహిళ సూసైడ్
చెట్టుకు ఉరి వేసుకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో ఈ ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి క్రాస్ రోడ్ సమీపంలో గుర్తుతెలియని మహిళ చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News January 14, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
News January 14, 2025
ఖమ్మం: మంత్రి తుమ్మల పట్టుబట్టి మరి సాధించారు: ఉత్తమ్
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను మంత్రి తుమ్మల పట్టు బట్టి మరి సాధించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సంక్రాంతి కానుకగా రఘునాథపాలెం ప్రజలకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఇవ్వాలని తుమ్మల పట్టుబట్టారన్నారు. రూ.1.8 లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రంగా ఆయకట్టు నిర్మించినా సాగులోకి మాత్రం తీసుకు రాలేదన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించి ఒక్క ఎకరాకు సైతం సాగు నీరు అందించలేదన్నారు.