News March 24, 2024
కూసుమంచి , ఖమ్మం మీదుగా కొత్త రైల్వే లైన్

డోర్నకల్ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల వరకు నూతనంగా రైల్వేలైన్ మంజూరు కాగా.. నిర్మాణానికి సర్వే పూర్తికావడంతో మార్కింగ్ ఇస్తున్నారు. ఈ రైల్వేలైన్ పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల మీదుగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో మార్కింగ్ చేస్తుండగా తాము భూములు కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 11, 2025
ఖమ్మం: కౌలు రైతులు పత్తి విక్రయానికి నమోదు చేసుకోవాలి: కలెక్టర్

కౌలు రైతులు మద్దతు ధరకు తమ పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకోవడానికి అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. దళారుల జోక్యం లేకుండా కౌలు రైతులు నేరుగా పత్తి విక్రయం చేయగలరని చెప్పారు. ఇందుకు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద తమ వివరాలను నమోదు చేసుకొని, అనంతరం సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలని సూచించారు.
News November 11, 2025
ఖమ్మం: ఆయిల్ పామ్ పంట రైతులకు అధిక లాభాలు: కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్‌లో సహకార సంఘాల డైరెక్టర్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆయిల్ పామ్ లాభసాటి పంట అని అన్నారు. వరి, పత్తి, మిర్చి పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో అధిక లాభాలు ఇస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ఎకరాకు రూ.50వేల సబ్సిడీతో పాటు ప్రభుత్వం డ్రిప్, నిర్వహణ ఖర్చులకు సహాయం అందిస్తుందని ఈ సంవత్సరం జిల్లాకు 14,500 ఎకరాల సాగు లక్ష్యం ఉన్నట్లు తెలిపారు.
News November 10, 2025
ఖమ్మం: సమస్యల పరిష్కారంపై అధికారులు చురుకుగా ఉండాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వ్యతిరేక వార్తలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న సేకరణ సజావుగా జరగాలని, పాఠశాలల భోజన నాణ్యత పర్యవేక్షించాలని ఆదేశించారు. రెండు పడకల ఇళ్ల కేటాయింపులు, ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలుపై కూడా కలెక్టర్ అధికారులకు సూచనలు ఇచ్చారు.


