News August 24, 2025
కృత్తివెన్ను: ఇద్దరి యువకులపై పోక్సో కేసు

కృత్తివెన్ను మండలంలో మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడితో పాటు అతనికి సహకరించిన మరొక యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పైడిబాబు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం ఇద్దరు యువకులను రిమాండ్కు తరలించినామని చెప్పారు. 18 సంవత్సరాలలోపు ఉన్న బాలికలను ప్రేమ పేరుతో వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Similar News
News August 25, 2025
విగ్రహాల ఏర్పాటు అనుమతులకు నేడు చివరి తేదీ: DSP

వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాల ఏర్పాటు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సోమవారం చివరి రోజు అని మచిలీపట్నం డీఎస్పీ సి.హెచ్. రాజా ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవ నిర్వాహకులు సాయంత్రం 4 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 450 విగ్రహాల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
News August 25, 2025
మచిలీపట్నం: నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మచిలీపట్నం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News August 24, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ మోపిదేవిలో మహిళ ఆత్మహత్య
☞ మచిలీపట్నంలో రేపు గ్రివెన్స్: కలెక్టర్
☞ మచిలీపట్నంలో సైకిల్ చేసిన ఎస్పీ
☞ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
☞ జాతియ స్థాయిలో నాగాయలంక క్రీడాకారుల సత్తా
☞ సెప్టెంబర్ 7న దుర్గ గుడి మూసివేత
☞ కృత్తివెన్నులో ఇద్దరు యువకులపై ఫోక్సో కేసు