News August 18, 2025
కృత్రిమ కొరత సూచిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

రెవిన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి సోమవారం సమీక్ష సమావేశాన్ని జరిపారు. రైతుల సమస్యలపై ఆయన ఆరా తీశారు. జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే రైతులకు కావాల్సిన డీఏపీ అందుబాటులో ఉందన్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సూచిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే షాపు లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామన్నారు.
Similar News
News August 18, 2025
రాహుల్‌కు కాబోయే భార్య ఎవరో తెలుసా?

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం ఆయన ప్రేయసి హరిణి రెడ్డితో జరిగిన సంగతి తెలిసిందే. ఆమె కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె స్వస్థలం నెల్లూరు. నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న విజయ్ కుమార్ కూతురే హరిణి. విజయ్ కుమార్ 1985లో సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. స్పెషల్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్‌కు ఇటీవల TG ప్రభుత్వం రూ.కోటి నజరానా అందజేసింది.
News August 18, 2025
‘సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలి’

ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు నిర్ణీత నమూనాలో సమర్పించాలని అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుపై సోమవారం అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 4,700 కు పైగా ప్రభుత్వ కనెక్షన్ లు ఉన్నాయనీ, 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేశారన్నారు.
News August 18, 2025
VKB: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు తక్షణం పరిష్కారం: కలెక్టర్

ప్రజావాణికి వచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా అధికారులకు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణికి 45 ఫిర్యాదు వచ్చాయన్నారు. రైతుల భూ సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలన్నారు.