News December 15, 2025

కృష్ణమ్మ చెంతనే దాహం.. తాగునీటికి తంటాలు.!

image

పెనమలూరు, తాడిగడప మున్సిపాలిటీ (యనమలకుదురు, కానూరు) కృష్ణా నది పక్కనే ఉన్నా, ఈ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. భూగర్భ జలాల్లో TDS 800-1200 ఉండటంతో అవి తాగేందుకు పనికిరావడం లేదు. దీంతో వీధుల్లో నాణ్యత లేని వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వచ్చాయి. ఇటీవల మంజూరైన అమృత్ 2.0 నిధులు రూ. 30 కోట్లతోనైనా 2 లక్షల జనాభాకు కృష్ణా నది జలాలను అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News December 15, 2025

మర్రిగూడ: సాఫ్ట్‌వేర్ to సర్పంచ్

image

సొంతూరుకు సేవ చేయాలనే తపనతో మర్రిగూడకు చెందిన వీరమల్ల శిరీష అనే వివాహిత సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకొని సర్పంచ్‌గా ఎన్నికయింది. శిరీష ఎంటెక్ పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

News December 15, 2025

ధరలు మార్చకుండా ప్రయోజనాలు తగ్గించిన AIRTEL

image

ఎయిర్‌టెల్‌ తన అన్‌లిమిటెడ్ 5G బూస్టర్ ప్యాక్‌ల డేటా ప్రయోజనాలను గణనీయంగా తగ్గించింది. ₹51, ₹101, ₹151 ప్యాక్‌లపై గతంలో లభించిన 3GB, 6GB,9GB డేటా ఇప్పుడు 1GB, 2GB,3GBకు తగ్గించింది. ధరలు మారనప్పటికీ డేటా తగ్గడంతో వినియోగదారులకు నష్టం కలగనుంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ ప్యాక్‌ల ప్రయోజనాలనూ ఇలానే తగ్గించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

News December 15, 2025

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు !

image

నిజామాబాద్ జిల్లా ప్రజలకు పలు కీలక సూచనలు చేస్తూ సోమవారం అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్టలు నిషేధం అని తెలిపారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేల వాడకం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఈ నిబంధనలు ఈ నెల 31 వరకు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.