News October 6, 2025
కృష్ణాజిల్లా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలు

కృష్ణాజిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్ 14, 17 బాల బాలికల వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ ఎంపికలు ఈనెల 7న ఉదయం 9 గంటలకు నున్న ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమవుతాయి. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, పాఠశాల HM సంతకం, సీల్‌తో ఉన్న ఎంట్రీ ఫారం తీసుకురావాలని SGF కార్యదర్శులు దుర్గారావు, రాంబాబు తెలిపారు.
Similar News
News October 5, 2025
రేపు మచిలీపట్నంలో ప్రజా వేదిక: కలెక్టర్

మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మండలం, మున్సిపల్ కార్యాలయాలలోనూ నిర్వహిస్తారన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను ఆయా కార్యాలయాలు లేదా కలెక్టరేట్‌లో అందజేయవచ్చన్నారు.
News October 5, 2025
గుడివాడలో లారీ ఢీకొని వ్యక్తి మృతి

గుడివాడ రూరల్ మండలం బిళ్లపాడు గేటు వద్ద లారీ ఢీకొన్న ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. గుడివాడలోని కాకర్ల వీధికి చెందిన సూర్యారావు చిన్నఎరుకపాడు నుంచి స్వగృహానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో అతన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
News October 5, 2025
మచిలీపట్నంలో నాన్ వెజ్ ధరలు ఇవే.!

మచిలీపట్నంలో చికెన్, మటన్ ధరలు గత వారం రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. చికెన్ విత్ స్కిన్ కిలో ధర రూ. 200 ఉండగా స్కిన్ లెస్ కిలో ధర రూ. 220 అమ్మకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మటన్ కిలో ధర మచిలీపట్నంలో రూ. 1000 ఉండగా, పల్లెల్లో కిలో మటన్ ధర రూ. 800కి విక్రయాలు జరుగుతున్నాయి. మచిలీపట్నం డివిజన్ పరిధిలో ఉన్న మాంసం దుకాణదారులు మొత్తం ఈ రేట్లకే అమ్మకాలు కొనసాగిస్తున్నారు.