News December 11, 2024
కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 22 పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO డా. గీతాబాయి తెలిపారు. ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్-2 నాలుగు పోస్టులు, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లి ఎనిమిది పోస్టులు, శానిటరీ అటెండర్ కం వాచ్ మెన్ 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి, అర్షత గల వారు ఈ నెల 16 లోపు డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందజేయాలన్నారు.
Similar News
News January 2, 2026
కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ప్రశంసించిన చంద్రబాబు

కలెక్టర్ డీకే బాలాజీని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మలిచిన తీరు అభినందనీయమన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.
News January 2, 2026
కృష్ణా: రైతులకు రాజముద్రతో కొత్త పాస్‌పుస్తకాలు

కృష్ణా జిల్లాలో రీ-సర్వే పూర్తయిన 176 గ్రామాల రైతులకు రాజముద్ర కలిగిన నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలోని 21 మండలాల్లోని లబ్ధిదారులకు ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభలలో వీటిని అందజేయనున్నారు. ఇప్పటికే E-KYC ప్రక్రియ ముగియగా, బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయిన వారికి నేరుగా పట్టాలు అందనున్నాయి.
News January 2, 2026
కృష్ణా: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి రెవెన్యూ గ్రామసభలు

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి రెవెన్యూ గ్రామసభలు ప్రారంభం కానున్నాయి. ఈ గ్రామసభలలో రీ-సర్వే పూర్తయిన అనంతరం రాజముద్రతో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అధికారులు అందజేయనున్నారు. భూముల వివరాలపై సందేహాలు ఉంటే అక్కడికక్కడే నివృత్తి చేసే అవకాశం కల్పించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 82,210 పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.


