News October 7, 2025
కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పి.యుగంధర్

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పి.యుగంధర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు అనంతపురం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న యుగంధర్‌ని పదోన్నతిపై కృష్ణాజిల్లా డీఎంహెచ్ఓగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా వెంకట్రావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో యుగంధర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
Similar News
News October 7, 2025
పమిడిముక్కల వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

పమిడిముక్కల మండలం తాడంకి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సీఐ చిట్టిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. చీకుర్తి నరసింహారావు (50) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తుండగా అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు.
News October 7, 2025
విజయవాడలో జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, 17 బాల బాలికల తైక్వాండో జట్ల ఎంపికలు సోమవారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఐఎంసీ స్టేడియంలో జరిగిన ఈ ఎంపికలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని దుర్గారావు తెలిపారు. ఉత్సాహంగా జరిగిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌కు ఎంపిక చేశారు.
News October 6, 2025
విజయవాడలో 9న అండర్-19 చెస్ జిల్లా జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) ఆధ్వర్యంలో ఈ నెల 9న విజయవాడలోని KBN కాలేజీలో అండర్-19 చెస్ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన సూచించారు.