News March 13, 2025
కృష్ణాజిల్లా TODAY TOP NEWS

* మచిలీపట్నంలో ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తికి ఏడేళ్లు జైలు
* కృష్ణాజిల్లాలో ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్.. విద్యార్థుల జోష్
* మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.7.63లక్షలు
* వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ 17కి వాయిదా
* తాడేపల్లిలో జగన్‌ని కలిసి కృష్ణాజిల్లా వైసీపీ నేతలు
* కృష్ణా జిల్లాలో 145 పరీక్షా కేంద్రాలు: Way2Newsతో- DEO
* GDV: రైలులో నుంచి జారిపడి మహిళ మృతి
Similar News
News March 13, 2025
జగన్‌తో కృష్ణాజిల్లా వైసీపీ నేతల భేటీ

మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని నాయకత్వంలో జిల్లాలోని ఆ పార్టీ నేతలు గురువారం తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ని కలిశారు. యువత పోరు పేరుతో కలెక్టరేట్ వద్ద బుధవారం జరిగిన ధర్నా విజయవంతం అయిన తీరు, జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను జగన్‌కు వివరించారు. జగన్‌ని కలిసిన వారిలో సింహాద్రి రమేష్, కైలే అనిల్, ఉప్పాల రాము, పేర్ని కిట్టు తదితరులు ఉన్నారు.
News March 13, 2025
బోరగడ్డ అనిల్‌ను మచిలీపట్నం తీసుకురానున్న పోలీసులు

YCP నేత బోరుగడ్డ అనిల్‌పై చిలకలపూడి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై దూషణ కేసులో అనిల్ కుమార్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆయనపై గతంలో చిలకలపూడి PSలో 2 కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో రాజమండ్రి నుంచి కాసేపటి క్రితం అనిల్‌ను ఇక్కడకు తీసుకొచ్చారు.
News March 13, 2025
మచిలీపట్నంలో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

మచిలీపట్నంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేశ్వరరావు రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వెళ్తున్న లారీ కాలును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన కుడి కాలు పాద భాగం నుజ్జు నుజ్జైంది. క్షతగాత్రుడిని వెంటనే మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.