News August 13, 2025
కృష్ణానదిలో ఇద్దరి యువకుల గల్లంతు

ఇసుక తోడే డ్రెజర్ స్థానం మార్చేందుకు తాడేపల్లి సీతానగరానికి చెందిన ముగ్గురు యువకులు నదిలోకి దిగి గల్లంతయ్యారు. ఈ ఘటన తుళ్లూరు (M) ఉద్దండరాయునిపాలెంలో చోటుచేసుకుంది. కామేశ్వరావు(19), వీర ఉపేంద్ర(22) కొట్టుకెళ్లగా వెంకటేశ్వర్లు సురక్షితంగా బయటపడ్డాడు. మరోవైపు కొండమోడు వద్ద పోతులవాగులో వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది. కృష్ణా నదికి వరద నీరు వస్తుండటంలో ప్రజలు ప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News August 14, 2025
భీమవరం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08816 299181 ఏర్పాటు చేశామని చెప్పారు. అధికారులంతా ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలని, సెలవులు రద్దు చేసినట్లు చెప్పారు. రానున్న 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
News August 14, 2025
జేవీఆర్, కిష్టారం ఓసీలలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఓసీలలో బొగ్గు ఉత్పత్తి, ఓబీలు నిలిచినట్లు పీవోలు ప్రహ్లాద్, నరసింహారావు తెలిపారు. Jvr OCPలో 68 mm వర్షపాతం నమోదవగా.. 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.20 లక్షల క్యూబిక్ మిలియన్ల ఓబీ పనులు నిలిచాయి. అదేవిధంగా Kistaramఓసీలో 6 వేల టన్నుల బొగ్గోత్పత్తి, 30 వేల క్యూబిక్ మిలియన్ల ఓబీ పనులు నిలిచాయి.
News August 14, 2025
కరీంనగర్: నేటితో PACSల కాల పరిమితి ఖతం!

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల గడువు నేటితో ముగియనుంది. ఉమ్మడి కరీంనగర్‌లోని 131 PACSలకు 2020 ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత సహకార సొసైటీల పాలకవర్గాల సభ్యులను ఎన్నుకున్నారు. వారి 5 ఏళ్ల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 13న ముగియగా.. ప్రభుత్వం 6 నెలల పదవీకాలం పొడిగించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం PACS 123 ఉండగా కరీంనగర్లో 30, జగిత్యాల 51, సిరిసిల్ల 22, పెద్దపల్లిలో 20 ఉన్నాయి.