News July 27, 2024
కృష్ణానదిలో పెరుగుతున్న నీటిమట్టం

కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. 865 అడుగుల మేర వరద జలాల ప్రవాహం ఉండటంతో సప్తనదుల ప్రాంతంలో సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా మునుగుతుందని పురోహితులు రఘురామ శర్మ చెప్పారు. సంగమేశ్వర క్షేత్రంతో పాటు సోమశిల, జటప్రోల్‌లో పురాతన దర్గాలు, సురభిరాజుల కట్టడాలు పూర్తిగా ముంపునకు గురవుతాయని తీర గ్రామాల ప్రజలు పేర్కొన్నారు.
Similar News
News August 5, 2025
MBNR: ఆగస్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

ఆగస్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించి వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆమె సమావేశం అయ్యారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్‌లో వేదిక వీఐపీలు, అధికారులు, మీడియా ఇతరులకు సీటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. పెరేడ్ మైదానంలో తాగునీరు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు.
News August 5, 2025
PU ఇంజినీరింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్‌గా మొహియుద్దీన్

పాలమూరు యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ గౌస్ మొహియుద్దీన్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని పాలమూరు యూనివర్సిటీ ఉపసంచాలకులు ఆచార్య జి.ఎన్.శ్రీనివాస్ మంగళవారం అందజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
News August 5, 2025
పీయూ అకాడమిక్ ఆడిట్ సెల్ కో-ఆర్డినేటర్‌గా రవికుమార్

పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ విభాగానికి చెందిన డాక్టర్ రవికుమార్‌ను అకాడమిక్ ఆడిట్ సెల్ కోఆర్డినేటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్యపూస రమేశ్ బాబు, అకాడమీ ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్ర కిరణ్ నియామక పత్రాన్ని అందజేశారు. ప్రిన్సిపల్స్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ రవికాంత్, డాక్టర్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.