News March 1, 2025
‘కృష్ణా’లో ఇంటర్ పరీక్షలకు 45,430 మంది

జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 63 కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా 45,430 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో జనరల్ విద్యార్థులు 43,795 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1635 మంది ఉన్నారు. ఫస్టియర్‌కు సంబంధించి జనరల్ విద్యార్థులు 23,630, ఒకేషనల్ విద్యార్థులు 927 మంది, సెకండియర్‌కు సంబంధించి జనరల్ విద్యార్థులు 20,175, ఒకేషనల్ విద్యార్థులు 708 మంది ఉన్నారు.
Similar News
News March 1, 2025
కృష్ణా: నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

కొత్త వాహన చట్టాన్ని మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు కృష్ణా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. ఇకపై హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5వేలు, మద్యం తాగి, సెల్‌ఫోన్ పట్టుకుని వాహనం నడిపితే రూ.10వేలు, నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేల జరిమానా విధించనున్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సహకరించాలని అధికారులు కోరారు.
News March 1, 2025
వార్షిక బడ్జెట్‌లో విజయవాడ మెట్రోకు రూ.50కోట్లు

వార్షిక బడ్జెట్‌లో విజయవాడ మెట్రో నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లు కేటాయించింది. కాగా మెట్రో పూర్తిచేసేందుకు కేంద్రం 100% భరించేలా గతంలో రాష్ట్రం ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనపై కేంద్రం అధికారిక ప్రకటన ఇచ్చినట్లయితే రాష్ట్రం నుంచి మరిన్ని నిధుల కేటాయింపుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం విజయవాడ మెట్రోపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
News March 1, 2025
రూ.45లక్షలతో జీజీహెచ్‌లో మౌలిక వసతులు – కలెక్టర్

కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులు రూ.45 లక్షలతో మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని తన ఛాంబర్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. జీజీహెచ్‌లో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు.