News December 30, 2025
కృష్ణా: అజ్ఞాతంలో వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. 2024 జూన్ 7న సునీల్‌పై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 17న మాచవరం పోలీసులు వంశీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి వంశీ కనిపించకపోవడంతో, అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మొన్నటి వరకు నియోజకవర్గంలో ఆక్టివ్‌గా ఉన్న వంశీ సడన్‌గా అదృశ్యమయ్యారు.
Similar News
News January 1, 2026
వరంగల్: సార్.. రేపు అసెంబ్లీలో మీ క్వశ్చన్ ఉంది..!

అసెంబ్లీలో లీకు వీరులున్నారు. ప్రతిపక్ష MLAలు అడిగే ప్రశ్నలను, లిఖిత పూర్వకంగా అసెంబ్లీ నిర్వాహకులకు అందజేసి, అధికారుల నుంచి సమగ్ర సమాచారం తెప్పించడం రివాజు. ఉమ్మడి WGLకు చెందిన ఓ నేత కుమారుడి ఇసుక మాముళ్ల దందా వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు ఓ ప్రతిపక్ష పార్టీ MLA ఇచ్చిన ప్రశ్నను, జిల్లాకు చెందిన నేతకు సమాచారం అందించారు. ఆ ప్రశ్న జీరో అవర్లో రాకుండా చేయడానికి పడరాని పాట్లు పడుతున్నట్లు సమాచారం.
News January 1, 2026
ఇల్లందు: 51 శాతం బొగ్గు ఉత్పత్తి: GM కృష్ణయ్య

డిసెంబర్-2025 నెలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి 5.30 లక్షల టన్నులకు గాను 2.71 లక్షల టన్నుల బొగ్గు తీసి మొత్తం 51 శాతం ఉత్పత్తి చేసినట్లు జియం వి.కృష్ణయ్య తెలిపారు. గురువారం డిసెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. 1.56 లక్షల టన్నులు రోడ్డు మార్గం ద్వారా, ఆర్.సి.హెచ్.పి ద్వారా 1.13, ఇల్లందు ఏరియాలో మొత్తం 2.26 లక్షల టన్నుల బొగ్గు బట్వాడా చేశామన్నారు.
News January 1, 2026
గుంతకల్లులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుంతకల్లులోని పారిశ్రామిక వాడ సమీపంలో గురువారం చోటు చేసుకున్న ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. బైక్‌పై వెళ్తున్న అతను ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


