News June 28, 2024

కృష్ణా: అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి అనిత

image

రాష్ట్రంలో వర్షాలు, వరద ముంపు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో 8 జిల్లాల కలెక్టర్లు, DROలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అనంతరం ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్‌ను అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా అలర్ట్ సెంటర్ విధులను అక్కడి అధికారులు ఆమెకు వివరించారు.

Similar News

News July 3, 2024

DSC అభ్యర్థులకు.. విజయవాడలో ఫ్రీ కోచింగ్

image

DSC పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికై అభ్యర్థులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ సంచాలకులు కిరణ్మయి తెలిపారు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో పండరీపురం రోడ్ నం.8 అశోక్‌నగర్‌, విజయవాడలోని స్టడీ సర్కిల్‌లో నిర్ణీత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 30తో దరఖాస్తు గడువు ముగియగా తాజాగా జులై 10 వరకు పెంచామని ఆమె చెప్పారు.

News July 3, 2024

విజయవాడ: ఆదాయపు పన్ను చెల్లించడం మన కర్తవ్యం

image

ఆదాయపు పన్ను చెల్లించడం మన కర్తవ్యమని ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడాలని డీఆర్ఎం నరేంద్ర, ఆనందరావు, పాటిల్ కోరారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్, ఆదాయపు పన్ను శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రైల్వే ఆడిటోరియంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆదాయ సేకరణ కీలకమని చెప్పారు.

News July 3, 2024

మైలవరం: పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం

image

పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం చూపిన ఘటన మైలవరంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మైలవరంలోని 5వ సచివాలయ పరిధిలో VROగా పనిచేస్తున్న తరుణ్‌ సోమవారం 43 మందికి పింఛన్‌లు పంచాడు. అనంతరం మరో 7మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఐరిస్ తీసుకుని సంతకం చేయించుకుని సర్వర్ పనిచేయలేదని తెలిపాడు. చివరికీ రూ.48వేల డబ్బును సొంతానికి వాడుకున్నాడు. విషయం తెలుసుకున్న MPDO, తహశీల్దార్ చర్యలు తీసుకుంటామన్నారు.