News December 9, 2025
కృష్ణా: అనధికార కట్టడాలు బోలెడు.. ఐనా రూపాయి కట్టరు.. ఎందుకంటే..?

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మున్సిపాలిటీల్లో అనధికార కట్టడాలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ, వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన బీపీఎస్ (BPS) జీఓకు స్పందన కరవైంది. జరిమానాలు అధికంగా ఉండటం, రెగ్యులర్ చేయించుకునేందుకు వెళ్లిన వారికి అధికారులు లంచాలు డిమాండ్ చేస్తుండటంతో కేవలం 10% మంది కూడా ముందుకు రావటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు అవగాహన కూడా కల్పించకపోవడం గమనార్హం.
Similar News
News December 12, 2025
తండ్రయిన టాలీవుడ్ యంగ్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తండ్రయ్యారు. ఆయన భార్య కల్పనారావు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తిరువీర్ తన ఆనందాన్ని X వేదికగా పంచుకున్నారు. ‘నాయినొచ్చిండు ❤️’ అంటూ బిడ్డ చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేయగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘మసూద’, ‘పలాస 1978’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన తిరువీర్.. కల్పనారావును 2024లో వివాహం చేసుకున్నారు.
News December 12, 2025
HYD: ITI చేశారా? జాబ్ కొట్టండి..!

జిల్లా ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నర్సయ్య తెలిపారు. చర్లపల్లిలో ఉన్న కంపెనీలో టెక్నికల్ ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నారన్నారు. మల్లేపల్లిలోని ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా ఉంటుందన్నారు. ఫిట్టర్, వెల్డర్‌లో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు హాజరుకావచ్చని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు.
News December 12, 2025
MHBD: తొలి విడత ఏకగ్రీవ సర్పంచులు వీరే..!

జిల్లాలో తొలి విడత 9 మంది ఏకగ్రీవ సర్పంచులుగా ఎన్నియ్యారు. నెల్లికుదురు (M) పార్వతమ్మ గూడెం నుంచి పూలమ్మ, కేసముద్రం(M) చంద్రుతండా శ్రీను, క్యాంపు తండా కైక, నారాయణపురం యమున, ఇనుగుర్తి (M)పాతతండా నరేష్, రాము తండా భూక్యా మీటు నాయక్, MHBD(M) సికింద్రాబాద్ తండా నూనావత్ ఇస్తారి, రెడ్యాల ఐలబోయిన లక్ష్మి, గూడూరు(M)రాజన్ పల్లి సర్పంచ్‌గా మంగ ఏకగ్రీవం అయ్యారు.


