News March 11, 2025
కృష్ణా: అనాధల సంరక్షణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

శిశు గృహాల్లో ఉంటున్న అనాధ పిల్లలను కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) పోర్టల్ ద్వారా దత్తత తీసుకునేందుకు వీలుగా అందులో పిల్లల వివరాలను అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బాలల సంక్షేమ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో జడ్పీ సీఈవో కన్నమ నాయుడు, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, డీఈఓ ఎం.జె రామారావు ఉన్నారు.
Similar News
News December 18, 2025
కృష్ణా: 22కి ఉద్యోగుల గ్రీవెన్స్ మార్పు- కలెక్టర్

జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 19న జరగాల్సిన ఉద్యోగుల గ్రీవెన్స్ సమావేశం 22వ తేదీకి వాయిదా పడిందని కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు. అధికారిక కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశానికి పూర్తి నివేదికలతో హాజరుకావాలని ఆయన ఆదేశించారు.
News December 18, 2025
రేపు కృష్ణా జిల్లా సమీక్షా మండలి సమావేశం

ఈనెల 19వ తేదీన కృష్ణా జిల్లా సమీక్షా మండలి సమావేశం నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు.
News December 18, 2025
గన్నవరంలో విమానాలు ల్యాండింగ్‌కి అంతరాయం

గన్నవరంలో గురువారం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ ప్రభావంతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ల్యాండింగ్‌కు ఆటంకం ఏర్పడింది. బెంగళూరు నుంచి గన్నవరం చేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వే క్లియరెన్స్ లేక గాల్లో చక్కర్లు కొట్టింది. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణం మెరుగుపడిన తర్వాతే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.


