News May 11, 2024
కృష్ణా: అభ్యర్థుల ప్రచారానికి సమయం ముగుస్తోంది

గత నెల రోజులుగా వివిధ పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచార పర్వాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మాత్రమే ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఈసీ ఆదేశాల ప్రకారం ప్రకారం.. నేటి సాయంత్రం 5 గంటలకే అభ్యర్థులు తమ, తమ ప్రచార పర్వాన్ని ముగించాలన్నారు. అందుకు సమయం ఆసన్నమైందని తెలిపారు. సమయానికి మించి ప్రచారం చేస్తే ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు అభ్యర్థులు బాధ్యులవుతారని హెచ్చరించారు.
Similar News
News January 2, 2026
పెడన: యువకుడి సూసైడ్

పెడన మండలం చెన్నూరు గ్రామంలో యర్రంశెట్టి వెంకటేష్ (28) తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. పెడన ఎస్‌ఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 2, 2026
కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ప్రశంసించిన చంద్రబాబు

కలెక్టర్ డీకే బాలాజీని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మలిచిన తీరు అభినందనీయమన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.
News January 2, 2026
కృష్ణా: రైతులకు రాజముద్రతో కొత్త పాస్‌పుస్తకాలు

కృష్ణా జిల్లాలో రీ-సర్వే పూర్తయిన 176 గ్రామాల రైతులకు రాజముద్ర కలిగిన నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలోని 21 మండలాల్లోని లబ్ధిదారులకు ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభలలో వీటిని అందజేయనున్నారు. ఇప్పటికే E-KYC ప్రక్రియ ముగియగా, బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయిన వారికి నేరుగా పట్టాలు అందనున్నాయి.


