News February 8, 2026

కృష్ణా: అమరావతి ORR వెడల్పుపై స్పష్టత.. రైతులకు ఊరట!

image

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెడల్పుపై నెలకొన్న ఆందోళనలకు NHAI అధికారులు తెరదించారు. ఇటీవల గెజిట్‌లో 250 మీటర్లుగా పేర్కొన్నప్పటికీ, రోడ్డు వెడల్పు 140 మీటర్లు మాత్రమేనని స్పష్టం చేశారు. మలుపులు, బఫర్ జోన్ల కోసం శాటిలైట్ సర్వేలో అదనపు విస్తీర్ణం చూపించాల్సి వచ్చిందని వివరించారు. 189 కి.మీ పొడవునా 5 జిల్లాలు, 23 మండలాల మీదుగా సాగే ఈ ప్రాజెక్టులో 140 మీటర్ల మేరకే రాళ్లు నాటనున్నట్లు తెలిపారు.

Similar News

News February 8, 2026

కమ్మర్‌పల్లి: ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడలు

image

కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం 8వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ వాలీబాల్ ఛాంపియన్షిప్-2026 పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐ గడ్డం నగేశ్, సర్పంచ్ కొత్తపల్లి హారిక పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిలో పట్టుదల, కృషి ఉంటే దేనినైనా సాధించవచ్చని అన్నారు. క్రీడాలు ఆరోగ్యానికి మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా ప్రతి విద్యార్థి పాల్గొనాలని కోరారు.

News February 8, 2026

సంక్రాంతి రేసులో టాలీవుడ్ ‘ఫోర్ పిల్లర్స్’!

image

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ను టాలీవుడ్‌కి నాలుగు పిల్లర్లుగా చెబుతుంటారు. వచ్చే సంక్రాంతికి వీరంతా బాక్సాఫీసు వద్ద పోటీ పడేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. చిరు-బాబీ, బాలయ్య-గోపీచంద్ మలినేని, నాగార్జున-కళ్యాణ్ కృష్ణ, వెంకటేశ్-అనిల్ రావిపూడి సినిమాలు పొంగల్ పోరుకు రెడీ అవుతున్నాయి. మరి వీటిలో ఏ పుంజు చివరి వరకు బరిలో ఉంటుంది? ఏది రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

News February 8, 2026

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా మైసూరుకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల సౌకర్యార్ధం ఉమ్మడి కృష్ణా మీదుగా CCT(కాకినాడ టౌన్)- మైసూరు(MYS) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07033 CCT- MYS రైలు మార్చి 2 నుంచి 30 వరకు ప్రతి సోమ, శుక్రవారం, నం.07034 MYS- CCT రైలు మార్చి 3 నుంచి 31 వరకు ప్రతి మంగళ, శనివారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.