News January 10, 2025

కృష్ణా: అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీఈడీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 3,4,5,6,7 తేదీలలో ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. టైం టేబుల్ పూర్తి వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు. 

Similar News

News January 11, 2025

కృష్ణా: ట్రాక్టర్లతో బరులు ధ్వంసం చేసిన పోలీసులు

image

కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కోడి పందేల నిర్వహణకై ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేశామని కృష్ణా జిల్లా పోలీసులు శుక్రవారం తమ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బరులను రెవెన్యూ అధికారులతో కలసి ధ్వంసం చేశామన్నారు. శాంతియుత వాతావరణంలో సంక్రాంతి పండుగను జిల్లా వాసులు జరుపుకోవాలని పోలీస్ సిబ్బంది Xలో సూచించారు. 

News January 10, 2025

ఉయ్యూరు: G3 థియేటర్‌కు నోటీసులు

image

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ సందర్భంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో G3 శ్రీనివాస థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అర్ధరాత్రి 1 గంటకు ఈ థియేటర్ బెనిఫిట్‌ షో వేస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని థియేటర్ యాజమాన్యానికి ఉయ్యూరు టౌన్ పోలీసులు నోటీస్ ద్వారా తెలిపారు.

News January 10, 2025

పోరంకిలో మహిళ హత్య  UPDATE

image

పోరంకిలో రాణి హత్యకు గురైన ఘటనకు సంబంధించి పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. రాణి కూతురు భర్త నరేశ్‌తో విభేదాల కారణంగా తన కూతురిలో తల్లి వద్దే ఉంటోంది. అయితే వారి కూతురి బడికి పంపకుండా మాల్‌లో పనికి పంపేవారు. ఈ విషయంపై అల్లుడు గురువారం అత్త ఇంటికొచ్చి తన కూతురిని చదివించకుండా పనికి పంపుతున్నారంటూ హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామన్నారు.