News February 8, 2026
కృష్ణా: అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో LL.B/B.A.LL.B చదివే విద్యార్థులు రాయాల్సిన 3, 7వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. FEB 19, 21, 24, 26, 28 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్శిటీ పరిధిలోని 2 కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.
Similar News
News April 14, 2026
బెంగాల్ ప్రజలకు కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు

* జిల్లా ఆస్పత్రుల్లో ఫ్రీ డయాలసిస్, క్యాన్సర్ చికిత్స సహా ₹10లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్
* అబ్బాయిలకు గ్రాడ్యుయేషన్ వరకు, మహిళలకు పీజీ వరకు ఉచిత విద్య
* రైతులకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ సహా ఏటా ₹15వేలు
* ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, AI స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు
* మహిళలకు నెలకు ₹2వేలు. <<-se>>#Elections2026<<>>
News April 14, 2026
ఈ నెల 16న పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ

మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించే బిల్లుపై ఈ నెల 16న పార్లమెంటులో చర్చ జరగనుంది. ఈ బిల్లుపై చర్చ కోసం లోక్‌సభలో 18 గంటలు, రాజ్యసభలో 10 గంటల సమయం కేటాయించారు. దీనిపై ప్రధాని మోదీ ఉభయ సభల్లో ప్రసంగించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వనున్నారు. 16, 17న లోక్‌సభలో, 18న రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించనున్నారు.
News April 14, 2026
DANGER: వేసవిలో ఇవి తింటే..

సమ్మర్‌లో అధిక నూనె ఉండే బజ్జీలు, పకోడీలు, చిప్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల అలసట, ఎసిడిటీ వస్తాయని, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని తెలిపారు. అలాగే స్వీట్లు, ప్యాకేజ్డ్ జ్యూసులు, షుగర్ ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ తాగొద్దని, వీటి వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని సూచించారు.


