News January 6, 2025

కృష్ణా: అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(2022, 23, 24 బ్యాచ్‌లు) రెగ్యులర్& సప్లిమెంటరీ(థియరీ) పరీక్షలను ఈనెల 29 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 18లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది. 

Similar News

News January 7, 2025

MTM: వసతి గృహంలో కలెక్టర్ పుట్టిన రోజు వేడుకలు

image

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థినుల సమక్షంలో తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. మచిలీపట్నం బచ్చుపేటలోని వసతి గృహాన్ని సందర్శించిన ఆయన విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఎగ్జామ్ ప్యాడ్, పెన్, స్కేల్, జామెంట్రీ బాక్స్, కొబ్బరి నూనె, ఫేస్ పౌడర్, హెయిర్ పిన్స్, టవల్, నాప్కిన్‌లతో కూడిన కిట్స్‌ను అందజేశారు. 

News January 7, 2025

’12వ తేదీ వరకు అభ్యంతరాల‌ స్వీకరణ’

image

ఎస్సీ కుల‌గ‌ణ‌నపై నిర్వహిస్తున్న అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌ గ‌డువును జ‌న‌వ‌రి 12వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. జనవరి 7వ తేదీతో గ‌డువు ముగియనుండ‌టంతో మ‌రొక 5 రోజులు పొడిగిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ప్ర‌త్యేక ఉత్త‌ర్వులు జారీ చేసింద‌ని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఓపీ విధివిధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబర్ జీవో విడుద‌ల చేసిన‌ట్లు తెలిపారు.

News January 7, 2025

వీరవల్లి: ప్రియుడి మోజులో కూతురిని రోడ్డుపై వదిలిన తల్లి

image

బాపులపాడు మండలంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నంద్యాల(D) పొన్నవరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె (11)ను తీసుకొని గతేడాది నవంబర్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య, కూతురు కనిపించడం లేదని ఆమె భర్త రవి నంద్యాల పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రియుడు మోజులో పడి బిడ్డను తల్లి వీరవల్లి రోడ్డుపై వదిలేసింది. సోమవారం బాలికను గుర్తించి నంద్యాల పోలీసులకు అప్పగించనున్నట్లు వీరవల్లి SI శ్రీనివాస్ తెలిపారు.