News August 4, 2025
కృష్ణా: ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభం

మచిలీపట్నం: జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం పీజీఆర్‌ఎస్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పోలీసు కవాతు మైదానంలో అన్ని అవసరమైన సౌకర్యాలను కల్పించాలన్నారు. శాఖలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
Similar News
News September 4, 2025
కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానాలు లేవు

కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానవాటికలు లేవని ఎస్సీ సంక్షేమ శాఖ గుర్తించింది. ఈ మేరకు గుడివాడలో 15, మచిలీపట్నంలో 15, ఉయ్యూరులో 43 గ్రామాలకు మొత్తం 72.98 ఎకరాలు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా భూసేకరణ చీఫ్ కమిషనర్ (CCLA)కు అందజేసింది.
News September 3, 2025
కృష్ణా జిల్లా రైతులకు శుభవార్త

కృష్ణా జిల్లాలో ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం పది రోజుల్లో 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా గుజరాత్ నుంచి వస్తుందని అధికారులు తెలిపారు. బుధవారం 1,200 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. పకడ్బందీగా యూరియా సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. పాస్ బుక్ ఉన్న రైతులకు 25 కేజీల యూరియా సరఫరా చేయనున్నారు.