News October 4, 2025
కృష్ణా: ఆటో డ్రైవర్ల సేవలో.. నియోజకవర్గాల వారీ లబ్ధిదారులు ఎంతంటే..?

కృష్ణా జిల్లాలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ ద్వారా 11,316 మంది డ్రైవర్లు మొత్తం రూ.16.97 కోట్లు లబ్ధి పొందనున్నారు. ఇందులో అవనిగడ్డలో 1,356 మందికి రూ.2.03 కోట్లు, గన్నవరం 1,550 మందికి రూ.2.32 కోట్లు, గుడివాడ 1,543 మందికి రూ.2.31 కోట్లు, మచిలీపట్నం 1,867 మందికి రూ.2.80 కోట్లు, పామర్రు 1,559 మందికి రూ.2.33 కోట్లు, పెడన 1,375 మందికి రూ.2.06 కోట్లు, పెనమలూరు 2,066 మందికి రూ.3.09 కోట్లు మేర లబ్ధి చేకూరనుంది.
Similar News
News October 4, 2025
ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరణ: కలెక్టర్

జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళికబద్ధంగా ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ నవీన్ తో కలిసి ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. గత సంవత్సరంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఖరీఫ్‌లో చాలా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇందుకోసం ముందుగానే ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు.
News October 3, 2025
10న నూజివీడు ఐఐటీ కళాశాలలో సాఫ్ట్ బాల్ జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 10న నూజివీడులోని ఐఐటీ కళాశాలలో అండర్-19 సాఫ్ట్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని ఎస్జీఎఫ్ అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, అలాగే పాఠశాల HM సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తప్పనిసరిగా తీసుకుని రావాలని ఆయన సూచించారు.
News October 3, 2025
కృష్ణా: 11,316 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రేపే నగదు

‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ద్వారా కృష్ణా జిల్లాలో 11,316 మంది ఆటో, టాక్సీ డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు. ఒకొక్క లబ్ధిదారునికి రూ.15వేలు చొప్పున రూ.16 కోట్ల 97లక్షల 40 వేలు బ్యాంక్ ఖాతాల్లో శనివారం జమ కానున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఒకొక్కరికి రూ.10 వేలు చొప్పున ఇవ్వగా కూటమి ప్రభుత్వం రూ.15 వేలు ఆర్థిక సాయాన్ని ఇస్తుండటం పట్ల ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.