News August 17, 2025
కృష్ణా: ఆధునిక యుగంలోనూ తావీజ్ ప్రభావం

ఆధునిక వైద్యం, సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా, ప్రజలలో కొన్ని పాతకాలపు నమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే తావీజ్ కేంద్రాలు. తావీజ్ ధరించడం వల్ల నిజంగా ఫలితం ఉంటుందా, లేదా అనేది శాస్త్రీయంగా నిరూపించబడలేదు. కానీ ఇది ప్రజల్లో ఒక రకమైన మానసిక బలం, ధైర్యం ఇస్తుందనేది వాస్తవం. అందుకే ఇప్పటికీ గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా తావీజ్ ధరించేవారి సంఖ్య తగ్గడం లేదు. మీ కామెంట్.
Similar News
News August 18, 2025
కృష్ణమ్మ ఉధృతి.. అప్రమత్తంగా ఉండాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

కృష్ణా నదిలో వరద ఉధృతి పెరుగుతున్నందున పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ సూచించారు. ఆదివారం సాయంత్రం అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వరద పరిస్థితులను సమీక్షించారు. వరద ప్రభావిత గ్రామాల్లో సచివాలయ సిబ్బంది ద్వారా దండోరా వేయించాలని అధికారులను ఆదేశించారు.
News August 17, 2025
కృష్ణా జిల్లాలో TODAY TOP NEWS

☞ ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద
☞ కృష్ణాజిల్లాలో డెంగీ ఆందోళన
☞ తేలప్రోలులో ఆటోను ఢీకొన్న కారు
☞ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తులు రద్దీ
☞ ఉచిత బస్సుల గుర్తింపునకు ప్రత్యేక స్టిక్కర్లు
News August 17, 2025
కృష్ణా జిల్లాలో డెంగీ ఆందోళన

కృష్ణా జిల్లా వ్యాప్తంగా డెంగీ జ్వరం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కసారిగా నీరసించి, ఏం జరిగిందో తెలియని అయోమయంలో పలువురు రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రక్త కణాలు వేగంగా తగ్గిపోవడం, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపడం వల్ల తీవ్రమైన స్థితిలో ఉన్నవారు విజయవాడ వంటి పెద్ద నగరాల ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స కోసం వెళ్తున్నారు.