News November 9, 2025

కృష్ణా: ఆ ప్రాజెక్టులు వస్తే తిరుగేలేదు.. సాధ్యమయ్యేనా.?

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 3 ప్రాజెక్టులపై సందిగ్ధత నెలకొంది. HYD-VJA, MTM-VJA 6 లైన్ల హైవేల DPRలలో మార్పులు చేయాలని నేతలు, కలెక్టర్లు NH అధికారులకు సూచించారు. మహానాడు జంక్షన్-నిడమానూరు ఫ్లైఓవర్ నిర్మాణం నిర్ణయం NH అధికారులు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే VJA రూపురేఖలు మారిపోతాయని MP చిన్ని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నేతలు ఢిల్లీలో NH అధికారులను కలుస్తామని తెలిపారు.

Similar News

News November 9, 2025

NZB: విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తా: కవిత

image

విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. శనివారం రాత్రి వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డులో వర్సిటీ విద్యార్థులతో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు, ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇతర అంశాల గురించి చర్చించారు.

News November 9, 2025

జన్నారం: గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

జన్నారం మండలం బాదంపల్లి శివారులోని గోదావరిలో గల్లంతైన యువకుడు గుండా శ్రావణ్ మృతి చెందారు. శనివారం బాదంపల్లి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి ఫోటో దిగుతూ ప్రమాదవశాత్తు ఆయన గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం బాదంపల్లి శివారులో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బయటకు తీశారు. శ్రావణ్ మృతితో ఆయన కుటుంబంతో పాటు పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.

News November 9, 2025

కాగజ్‌నగర్: పేదలకు అందని కంటి వైద్యం

image

కాగజ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో కంటి వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వం కంటి పరీక్షల కోసం సుమారు రూ.5 లక్షల విలువైన కంటి పరీక్ష యంత్రం (ఆప్టోమె ట్రిస్ట్) ఏర్పాటు చేసి వైద్యుడిని నియమించింది. 3 నెలల నుంచి యంత్రం మరమ్మతులో ఉంది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కంటివైద్యం అందని ద్రాక్షగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.