News May 21, 2024

కృష్ణా: ఆ 6,289 ఓట్లు ఎవరికి పడ్డాయో.?

image

గుడివాడ అసెంబ్లీ స్థానంలో తాజా ఎన్నికల్లో 82.51% పోలింగ్ నమోదు కాగా 1,68,537 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో పురుషులు 81,119, స్త్రీలు 87,408, ఇతరులు 10 మంది ఓటేశారు. పోలైన ఓట్లలో పురుషుల కంటే మహిళల ఓట్లు 6,289 ఎక్కువగా ఉన్నాయి. ఈ ఓట్లు తమకే పడ్డాయని అటు వైసీపీ, టీడీపీ ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి వెనిగండ్ల రాము, కొడాలి నాని పోటీ చేస్తుండగా జూన్ 4న తీర్పు వెలువడనుంది.

Similar News

News October 1, 2024

విజయవాడలో వైసీపీ నేత ఇంటికి వచ్చిన మాజీ కేంద్ర మంత్రి

image

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ కుమార్‌ని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భవానీపురంలోని ఆకుల నివాసానికి వచ్చిన పల్లంరాజును ఆకుల సాదరంగా ఆహ్వనించారు. గతం నుంచి ఆకుల శ్రీనివాస్ కుమారుతో ఉన్న స్నేహ సంబంధాల నేపథ్యంలో పల్లంరాజు ఆయన నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కలిసి గతంలో చేసిన పోరాటాలు, ఉద్యమాల గురించి గుర్తు చేసుకున్నారు.

News October 1, 2024

గుంటూరు జిల్లాలో జూ.NTR ‘దేవర’ సక్సెస్ మీట్.?

image

జూ.ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా గత నెల 27న రిలీజై భారీ వసూళ్లు రాబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలంలో అక్టోబర్ 3న ఫంక్షన్ ఏర్పాటుకు సోమవారం నిర్వాహకులు స్థలాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ నిర్వహించనుండగా.. చిత్రయూనిట్ పాల్గొననున్నట్లు సమాచారం.

News October 1, 2024

కొలికపూడి వ్యాఖ్యలపై మీ కామెంట్.!

image

మహిళా ఉద్యోగులకు తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు అసభ్యకర సందేశాలు పంపారని తిరువూరు మం. చిట్టేలలో నిన్న మహిళలు ఆరోపణలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు నిజమైతే అరెస్ట్ చేయాలని.. లేకపోతే వారికి శిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అసత్య ఆరోపణలను నియోజకవర్గ ప్రజలు నమ్మరని చెప్పారు. మరోవైపు, ఆయన నిన్న రాత్రి దీక్ష చేపట్టగా.. అధిష్ఠానం ఆదేశాల మేరకు విరమించారు. కొలికపూడి చేసిన వ్యాఖ్యలపై మీ COMMENT.