News March 1, 2025

కృష్ణా: ఇంటర్ ఫస్టియర్ తొలిరోజు పరీక్షకు 98.03% హాజరు

image

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్టు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు విద్యాశాఖాధికారి పీబీ సాల్మన్ రాజు తెలిపారు. తొలిరోజు పరీక్షకు 98.03% మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. మొత్తం 24,810 మందికి గాను 24,323 మంది పరీక్షకు హాజరయ్యారని, 487 మంది గైర్హాజరయ్యారన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు జిల్లాలో నమోదు కాలేదన్నారు. 

Similar News

News February 19, 2026

వసతి గృహాల్లో అంటు వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

సంక్షేమ వసతి గృహాల్లో అంటువ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌లో అంతర్ శాఖల ఉమ్మడి తనిఖీ కమిటీ సమావేశం జరిగింది. అంటువ్యాధుల ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. వసతి గృహాలను నిరంతరం తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డా. యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

News February 19, 2026

మంగినపూడి బీచ్‌లో 24న సందడే సందడి..!

image

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా స్థాయి సాప్ లీగ్ టోర్నమెంట్‌లో భాగంగా సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు ఈనెల 24న మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద నిర్వహించనున్నారు. అండర్-18 బాలురకు 10 కి.మీ., బాలికలకు 5 కి.మీ. దూరంతో పోటీలు నిర్వహిస్తారు. పాల్గొనదలచిన క్రీడాకారులు www.sports.ap.gov.inలో ముందుగా నమోదు చేసుకోవాలని జిల్లా క్రీడా అధికారి తెలిపారు.

News February 19, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* పెనమలూరులో ఈనెల 21న జాబ్ మేళా
* మచిలీపట్నంలో రైల్వే జాబ్ స్కామ్
* కృష్ణా: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష
* విజయవాడలో డివైడర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
* బందర్‌లో బెల్ట్ దందా
* గుడివాడ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
* గూడూరులో కొడుకు పై పేకాట కేసు.. తండ్రి ఆత్మహత్యాయత్నం