News May 28, 2024
కృష్ణా: ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(APOSS) నిర్వహించే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 1, 3, 5, 6, 7, 8వ తేదీల్లో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://apopenschool.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని APOSS వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి.
– SHARE IT
Similar News
News November 29, 2024
తొలిరోజే 100శాతం పెన్షన్ల పంపిణీ: కలెక్టర్ లక్ష్మీశ
డిసెంబర్ 1 ఆదివారం నేపథ్యంలో ముందు రోజే నవంబర్ 30న ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. తొలిరోజే 100 శాతం పెన్షన్ల పంపిణీకి అధికారులు, సిబ్బంది కృషిచేయాలని ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పంపిణీ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
News November 29, 2024
మచ్చిలీపట్నం: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
బందరు మండలం సుల్తానగరంలో సీతారామాంజనేయ రైస్ మిల్లును కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎంత మేర ధాన్యం కొనుగోలు చేశారో మిల్లు యజమానిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు.
News November 29, 2024
వందే భారత్ రైలులో ప్రయాణించిన మంత్రులు
తిరుపతి నుంచి విజయవాడకు వందే భారత్ రైలులో గురువారం ఏపీ మంత్రులు ప్రయాణించారు. నారావారి పల్లెలో నారా రామ్మూర్తి నాయుడు పెదకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రలు అనంతరం తిరిగి ప్రయాణమయ్యారు. మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ ప్రయాణంలో ఉన్నారు. ఈ మేరకు వారు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.