News September 6, 2025
కృష్ణా: ఈనెల 10న షూటింగ్ బాల్ జట్ల ఎంపికలు

కృష్ణాజిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాల బాలికల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు. ఈ ఎంపికలు ఈనెల 10న మధ్యాహ్నం 2 గంటలకు గుణదలలో జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావచ్చన్నారు. ఎంపికైన క్రీడాకారులు నెల్లూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు.
Similar News
News September 6, 2025
రైతుల్లో నమ్మకం పెంచేందుకు కృషి చేయండి: కలెక్టర్

జిల్లాలో యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని, రైతులలో నమ్మకం పెంపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. యూరియా సరఫరాపై శనివారం ఆయన అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మన గ్రోమోర్ కేంద్రాల నుంచి వీలైనంత వరకు యూరియాను గ్రామాలకు తీసుకొని వెళ్లి అక్కడి రైతులకు పంపిణీ సాఫీగా చేయాలని ఆదేశించారు.
News September 5, 2025
కృష్ణా నదిలో మృతదేహం లభ్యం

చల్లపల్లి (M) పురిటిగడ్డ శివారులోని నిమ్మగడ్డ వద్ద ఉన్న కృష్ణా నదిలో శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సుమారు 40-50 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషుడి శవం కొట్టుకువచ్చింది. మృతుడి వేలికి వేంకటేశ్వరస్వామి వెండి ఉంగరం, మరో ఎరుపు రంగు రాయి వెండి ఉంగరం ఉన్నాయి. VRO వెంకటేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు.. SI సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 5, 2025
కృష్ణా: యూరియా సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

కృష్ణా జిల్లాలో యూరియా సరఫరాపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. యూరియా ఇతర అవసరాలకు మళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. PACSల ద్వారా మాత్రమే రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ నిరంతరం PACSలను సందర్శిస్తూ సరఫరా తీరును పర్యవేక్షిస్తున్నారు. డిమాండ్ పెరగడంతో ఇతర జిల్లాల నుంచి 500 టన్నుల యూరియాను జిల్లాకు రప్పించారు.