News January 19, 2025
కృష్ణా: ఈ నెల 27తో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువు
కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో BA.LLB కోర్సులు(2024- 25 అకడమిక్ ఇయర్) చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్(Y19 నుండి Y23 బ్యాచ్‌లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను ఫిబ్రవరి 10 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 27లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News January 19, 2025
కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన షెడ్యూల్
కేంద్ర మంత్రి అమిత్‌షా గన్నవరం పర్యటన షెడ్యూల్ వివరాలను సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆదివారం ఉదయం 10.45 గంటలకు విజయవాడలోని నోవాటెల్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించే అమిత్‌షా కొండపావులులోని NIDM ప్రాంగణానికి చేరుకుంటారన్నారు. 11.15కి అక్కడ భవనాలను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం 11.35 గంటలకు NDRF పదో బెటాలియన్ క్యాంపస్‌ను ప్రారంభించి సభలో ప్రసంగిస్తారన్నారు.
News January 19, 2025
జగ్గయ్యపేట: తల్లితో సహజీనం చేస్తున్న వ్యక్తిని చంపాడు
ఈనెల 16న జగ్గయ్యపేటకు చెందిన ఎర్రంశెట్టి ఆంజనేయులు హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్యకు గల కారణాలను పోలీసులు వివరించారు. బెల్లంకొండ నరేశ్ అనే వ్యక్తి హత్య చేసినట్లు నిర్ధారించారు. నరేశ్ తల్లి ఆంజనేయులుతో సహజీవనం చేస్తున్నందున తట్టుకోలేని నరేశ్ హత్యచేశాడు. హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
News January 19, 2025
విజయవాడ మీదుగా భువనేశ్వర్‌కు స్పెషల్ ట్రైన్
ప్రయాణికుల రద్దీ మేరకు ఈ నెల 19న విజయవాడ మీదుగా చర్లపల్లి(CHZ)- భువనేశ్వర్(BBSR)కు నం.08550 స్పెషల్ రైలు నడుపుతున్నట్లు శనివారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ఆదివారం చర్లపల్లిలో ఉదయం 9 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:55కు విజయవాడ, సోమవారం ఉదయం 2:15 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ రైలు విజయవాడతో పాటు రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్‌తో పాటు పలు స్టేషన్లలో ఆగుతుందన్నారు.