News April 5, 2024
కృష్ణా: ఎం-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఎం-ఫార్మసీ విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 24, 26, 29, మే 1వ తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల టైం టేబుల్, పరీక్ష కేంద్రాల పూర్తి వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
Similar News
News October 27, 2025
మెుంథా తుఫాన్ ఇంకా ఎంత దూరం ఉందంటే.!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారనుందని APSDMA తెలిపింది. ఇది చెన్నైకి 640 కి.మీ, విశాఖపట్నానికి 740 కి.మీ, కాకినాడకు 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. నేడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
News October 27, 2025
కృష్ణా: తుఫాన్ భయం.. పంట రక్షణలో రైతులు నిమగ్నం

తుఫాన్ ప్రభావం కొనసాగుతుండడంతో ముందుగానే చేతికి వచ్చిన పంటను భద్రపరచుకునే పనుల్లో రైతులు జిల్లా వ్యాప్తంగా నిమగ్నమయ్యారు. వర్షం ఎప్పుడు మొదలవుతుందో అన్న ఆందోళనతో పంటను ఎండబెట్టి రాశులుగా చేసి భద్రపరుచుకుంటున్నారు. తుఫాన్ కారణంగా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం రాశులుగా వేసి తడవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
News October 27, 2025
దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయండి: కలెక్టర్

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్న దృష్ట్యా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలన్నారు.


