News November 20, 2025
కృష్ణా: ఎనిమిది మంది బిల్ కలెక్టర్‌లకు పదోన్నతి

కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న ఎనిమిది మంది బిల్ కలెక్టర్‌లకు పదోన్నతి లభించింది. పలు మండలాల్లో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. కలెక్టర్ డీకే బాలాజీ తన ఛాంబర్‌లో వారికి పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ అరుణ, ఏఓ సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 21, 2025
MTM: గోనె సంచుల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి గోనె సంచుల కొరత లేకుండా జాగ్రత్తపడాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బందరు మండలం భోగిరెడ్డిపల్లిలో పర్యటించిన ఆయన రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. గోనె సంచుల లభ్యత, నాణ్యతను పరిశీలించారు. అంతక ముందు గ్రామంలో ఇటీవల నిర్మించిన పంచాయతీ రాజ్ రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.
News November 20, 2025
మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్

మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘సాగర్ కవచ్’ అనేది భారతీయ తీర రక్షక దళం, ఇతర భద్రతా సంస్థలు నిర్వహించే ఒక వార్షిక సముద్ర భద్రతా విన్యాసం. సముద్ర ముప్పులను ఎదుర్కోవడానికి తీర ప్రాంత భద్రతా సంసిద్ధతగా ఈ డ్రిల్ నిర్వహించారు. తీర ప్రాంతంలో తీవ్రవాదులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సంవత్సరం ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.
News November 20, 2025
కృష్ణా: పంచాయితీలలో నిధుల గోల్‌మాల్.. రికవరీ ఆదేశాలు.!

ఉంగుటూరు MPDO 2019-21 వరకు నిధులను దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. జ్యోతి హయంలో రూ.58.56లక్షల నిధులు పక్కదారిలో వినియోగించబడినట్లు గుర్తించబడింది. పెద్దఅవుటపల్లి రూ.43.84లక్షలు, పొట్టిపాడు రూ.13.35లక్షలు, Nఅప్పారావుపేట రూ.1.37లక్షలు దారి మళ్లాయి. కార్యదర్శులు వెంకటేశ్వర్లు, అమీర్ బాషకు సంబంధించిన రూ.29.28లక్షలు MPDO ద్వారా దుర్వినియోగం అయిందని తేలడంతో కలెక్టర్ రికవరీ చర్యలకు ఆదేశించారు.


