News April 26, 2024

కృష్ణా: ఒకే పేరుతో పలు నామినేషన్లు

image

మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేరు కలిసేలా Ch బాలశౌరి అనే వ్యక్తి, YCP MP అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు పేరు కలిసేలా రావూరి చంద్రశేఖర్, అన్నే చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. పెడన TDP అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పేరు కలిసేలా కాగిత శ్రీహరి కృష్ణప్రసాద్, గుడివాడ YCP అభ్యర్థి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పేరు కలిసేలా వెంకటేశ్వరావు కొడాలి అనే వ్యక్తి పేరిట నామినేషన్లు దాఖలయ్యాయి.

Similar News

News April 21, 2025

కృష్ణా: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

image

కృష్ణా జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.

News April 21, 2025

కృష్ణా: ‘నేడు కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమం’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు(సోమవారం) కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంటుందన్నారు.

News April 20, 2025

కృష్ణా: LLB పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన LLB 3వ, 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం సూచించింది.

error: Content is protected !!