News October 21, 2025

కృష్ణా: కుటుంబానికి దూరం.. ఒత్తిడితో ఉద్యోగం

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న వేలాది మంది పోలీసులు పని ఒత్తిడిలోనే రోజులు గడుపుతున్నామని వాపోతున్నారు. సరెండర్ లీవులు, ఇతర సౌకర్యాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని, పండుగ రోజులలో సైతం కుటుంబానికి దూరంగా విధులలోనే ఉంటున్నామన్నారు. ఈ ఏడాది అయినా పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తమ సంక్షేమం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Similar News

News October 21, 2025

వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి

image

ODI క్రికెట్‌లో వెస్టిండీస్ అరుదైన రికార్డు సృష్టించింది. ఇవాళ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో మొత్తం 50 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించింది. ఫుల్ మెంబర్ జట్లలో ఇలా ఇన్నింగ్స్ అంతా స్పిన్నర్లే బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన BAN 213/7 స్కోర్ చేయగా, అనంతరం విండీస్ కూడా 50 ఓవర్లలో 213/9 స్కోర్ చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో విండీస్ విజయం సాధించింది.

News October 21, 2025

NLG: జాడ లేని టి ఫైబర్ పథకం

image

జిల్లాలోని పంచాయతీలకు డిజిటల్ సేవలను అందించాలనే లక్ష్యంతో చేపట్టిన టి-ఫైబర్ పథకం జాడ లేకుండా పోయింది. పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఇంటింటికీ అంతర్జాల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వం టి-ఫైబర్ ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్ర ఐటీశాఖ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసేలా పనులు ఆదిలోనే అటకెక్కాయి. అనేకచోట్ల పంచాయతీల్లో సౌర పలకలు అలంకారప్రాయంగా మారాయి.

News October 21, 2025

HYD: బీసీ నేతలపై కేసులను ఉపసంహరించుకోవాలి: ఆర్.కృష్ణయ్య

image

శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు పెడతారా అని BJP ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా బీసీ బంద్ విజయవంతమైందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారని చెప్పారు. అయితే బీసీ బంద్‌లో చిన్నాచితక గొడవలు జరిగాయని, వాటిని పోలీసులు కోరంతను కొండంత చేసి అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తమపై బనాయించిన 30 కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు.