News December 23, 2025

కృష్ణా: కేక్ ఇస్తానని చెప్పి.. 5ఏళ్ల చిన్నారిపై బాలుడి అత్యాచారం

image

కృష్ణా (D) మొవ్వ మండల పరిధిలోని ఓ గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై 13ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శిరీష వివరాల మేరకు.. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు పాపకు కేక్ ఇస్తానని చెప్పి బాలుడు అత్యాచారం చేశాడు. సోమవారం ఉదయం చిన్నారి కడుపు నొప్పితో బాధపడటంతో తల్లిదండ్రులు ఆసుపత్రిలో చూపించారు. వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News December 24, 2025

హోటల్‌గా రుషికొండ ప్యాలెస్.. 28న నిర్ణయం?

image

AP: రుషికొండ ప్యాలెస్‌ను హోటల్‌గా మార్చే అవకాశం ఉందని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. ఇందుకు తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్ కోర్, ఫెమా సంస్థలు ఆసక్తి చూపాయని మంత్రులు కేశవ్, దుర్గేశ్ వెల్లడించారు. ‘మాల్దీవ్, పుదుచ్చేరి బీచ్ హోటల్స్‌పై చర్చించాం. ప్రజలకు పనికొచ్చేలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా వినియోగిస్తాం. గత ప్రభుత్వ నిర్ణయంతో నెలకు ₹25L భారం పడుతోంది’ అని చెప్పారు. ఈ 28న మరోసారి చర్చిస్తామన్నారు.

News December 24, 2025

కేసీఆర్ Vs రేవంత్.. విమర్శల వే‘ఢీ’

image

తెలంగాణ‌లో కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలు వేడెక్కాయి. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామంటూ ఇటీవల కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో ఈ నెల 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు సిద్ధమా? అంటూ రేవంత్ సవాల్ విసిరారు. దీన్ని KCR స్వీకరిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ ఆయన అసెంబ్లీకి వెళ్తే రేవంత్ Vs కేసీఆర్ మాటల యుద్ధంతో సభ దద్దరిల్లడం ఖాయం.

News December 24, 2025

నేరాల నియంత్రణే లక్ష్యం: ఎస్పీ

image

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయంగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి బుధవారం తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు.