News January 9, 2026

కృష్ణా: కోర్టులో ముగిసిన వాదనలు.. నిందితుల బెయిల్‌పై ఉత్కంఠ!

image

సంచలనం సృష్టించిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ ముగిసింది. తేలప్రోలు రాము సహా నలుగురు నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై SC, ST కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. ఈ నెల 12న తుది తీర్పు వెలువరించనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. పటమట PS CC ఫుటేజ్ సమర్పణపై కూడా విచారణ పూర్తయింది. గత విచారణకు రాని వంశీకి కోర్టు సమన్లు జారీ చేస్తూ తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Similar News

News February 6, 2026

ఆసిఫాబాద్: నలుగురికి 7 ఏళ్ల శిక్ష

image

వన్యప్రాణుల వేటకు అక్రమంగా విద్యుత్‌ అమర్చి ఓ వ్యక్తి మృతికి కారణమైన కేసులో నలుగురు నిందితులకు 7ఏళ్ల శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధిస్తూ ASF జిల్లా సెషన్స్ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 2018లో చింతలమానేపల్లి మండలం రవింద్రనగర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో దోషులకు గురువారం శిక్ష పడినట్లు ఎస్పీ నితికా పంత్ తెలిపారు.

News February 6, 2026

ఎడ్లపాడు: హైకోర్టును ఆశ్రయించిన విడదల రజిని

image

బోయపాలెం శ్రీవారి ఆలయ పర్యటనలో విద్వేషాలు రెచ్చగొట్టారనే ఆరోపణలపై నమోదైన కేసు విషయంలో మాజీ మంత్రి విడదల రజిని హైకోర్టును ఆశ్రయించారు. ఎడ్లపాడు పోలీసులు నమోదు చేసిన ఈ కేసును కొట్టివేయాలని ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం, నిందితులకు 35 (3) నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

News February 6, 2026

HYDలో అంతుచిక్కని Mystery!

image

విజయశాంతి సూసైడ్‌ కేసులో మిస్టరీ వీడలేదు. భర్తతో విభేదాలు, ఫ్యామిలీ టెన్షన్స్ లేవు. మెరుగైన జీవనం సాగిస్తోన్న ఫ్యామిలీ రైల్వే పట్టాలపై మృతదేహాలుగా మారడం అంతు చిక్కడం లేదు. సాంకేతిక ఆధారాలు పరిశీలించగా 2 అఫీషియల్ కాల్స్‌ మాత్రమే ఉన్నాయట. కారులో లభించిన ల్యాప్‌టాప్‌ను సైతం FSLకి పంపారు. అయితే, తల్లితో పాటు పిల్లలు కూడా సూసైడ్‌ చేసుకోవడం వెనుక కారణం ఏంటనే కోణంలో SCR పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.