News August 21, 2025
‘కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలి’

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని వంగవీటి మోహనరంగా సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడపా ప్రతాప్ చంద్ డిమాండ్ చేశారు. గురువారం మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రేమ్ ఆధ్వర్యంలో లెక్టర్ డి.కె. బాలాజీకి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రామారావు, చెన్నకేశవుల సత్యం, శ్రీనివాస్, లక్ష్మణరావు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News August 21, 2025
సంధ్యాసమయంలో కృష్ణా తీరం అందాలు

కృష్ణా నదీ తీరంలోని నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం వద్ద గురువారం సూర్యాస్తమయం వేళ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. సాయంత్రపు గాలులు, నది అలల తాకిడి, గగనంలో రంగుల వర్ణచిత్రం ఆ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా మార్చాయి. భక్తులు, సందర్శకులు ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ, పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మికతను అనుభవించారు.
News August 21, 2025
మచిలీపట్నం: ఎస్పీని కలిసిన డీఎస్పీ

కృష్ణా జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నూతన DSP కె.ధర్మేంద్ర గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ, శక్తి టీమ్స్ పనితీరును పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ నివారణతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని DSPకి వివరించారు.
News August 21, 2025
ఉత్తమ ఐఏఎస్‌గా కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీకి అవార్డు

ముస్సోరీలో ఐఏఎస్ మిడ్-కెరీర్ శిక్షణ పూర్తి చేసుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తమ ఐఏఎస్ అవార్డును అందుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ బర్ధన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ప్రజలకు అత్యున్నత సేవలు అందించడానికి తాను కృషి చేస్తానని కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.