News February 3, 2025
కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

మచిలీపట్నం-పెడన హైవేలో హర్ష కాలేజ్ సమీపంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రయాణిస్తున్న కారుకు ఆదివారం ప్రమాదం తప్పింది. కారుకు బైక్ అడ్డుగా రావడంతో తప్పించే క్రమంలో అదుపు తప్పింది. దీంతో కారు రోడ్డు మార్జిన్‌లో ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఎమ్మెల్యేకి ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News March 9, 2026
EVM గోడౌన్‌ను తనిఖీ చేసిన కృష్ణా కలెక్టర్

మచిలీపట్నంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న EVM గోడౌన్‌ను కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వివిధ రాజకీయ పక్షాల ప్రతినిథుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీలు తీయించారు. భద్రతా ప్రమాణాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ కె చంద్రశేఖరరావు, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
News March 7, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

* విజయవాడలో డ్రగ్స్ ముఠా అరెస్ట్
* కృష్ణ యూనివర్సిటీ డిగ్రీ 3,4 సెమిస్టర్ రీవాల్యూషన్ ఫలితాలు విడుదల
* ఉయ్యూరులో విద్యార్థుల మెడలో చెప్పుల దండ
* విజయవాడలో పోలీసులపై కాల్పులకు యత్నం.!
* కృష్ణాజిల్లాలో అంగన్వాడీ పోస్ట్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
* విజయవాడలో మూడు నెలలపాటు ఉచిత వెబ్ డెవలపర్ శిక్షణ
* మొవ్వ: బావిలో పడి మహిళా కూలి మృతి
News March 6, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

* నాగాయలంక: 18 నెలల పసికందును కాటేసిన పాము
వీరవల్లి: ల్యాబ్ అసిస్టెంట్‌పై దాడి ఘటనలో విద్యార్థులకు కౌన్సెలింగ్
* విజయవాడ: OLX పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
* విజయవాడలో బైక్ స్టంట్స్ చేస్తున్న యువకులకు కౌన్సెలింగ్
* విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కుంబాభిషేకం
* అసెంబ్లీ పాయింట్ వద్ద మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే


