News September 22, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ పెనమలూరు హెడ్ కానిస్టేబుల్‌కు ప్రశంసలు
☞ కృష్ణా: పల్లెకు కదిలిన పట్టణ వాసులు
☞ కానూరు: వైన్ షాపులో గొడవ.. ఒకరి మృతి
☞ కృష్ణా : డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల
☞ దుర్గ గుడికి తక్కువ సామానుతో రండి: NTR కలెక్టర్
☞ దుర్గగుడిలో భక్తులకు క్యూఆర్ సేవలు: NTR కలెక్టర్
Similar News
News September 28, 2025
హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శనివారం గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్‌గా ఉంచి కేసుల పరిష్కారంలో జాప్యం కాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణ కోసం రాత్రిపూట గస్తీని పెంచాలన్నారు.
News September 27, 2025
మచిలీపట్నంలో పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ కిట్లు పంపిణీ

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం డివిజన్‌లో పని చేస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కలెక్టర్ చేతుల మీదుగా శానిటేషన్ కిట్లు అందజేశారు. పరిసరాలను శుభ్రం చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో ఘనమైనదన్నారు.
News September 27, 2025
ఈ పంట నమోదలో ఆలస్యం వద్దు: కలెక్టర్

కృష్ణా జిల్లాలో ఈ-పంట నమోదు ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుగానే నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.