News July 10, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞కృష్ణా: రేపే మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
☞ గుడివాడ ఫ్లైఓవర్ పనులు వేగవంతం
☞ వీరవల్లి: మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు
☞ మచిలీపట్నం: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
☞ కృష్ణా: పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు
☞ మచిలీపట్నం: మైనర్ల తల్లిదండ్రులకు డీఎస్పీ రాజా హెచ్చరికలు
☞ కనకదుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న శాఖాంబరి ఉత్సవాలు
Similar News
News September 5, 2025
కృష్ణా: యూరియా సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

కృష్ణా జిల్లాలో యూరియా సరఫరాపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. యూరియా ఇతర అవసరాలకు మళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. PACSల ద్వారా మాత్రమే రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ నిరంతరం PACSలను సందర్శిస్తూ సరఫరా తీరును పర్యవేక్షిస్తున్నారు. డిమాండ్ పెరగడంతో ఇతర జిల్లాల నుంచి 500 టన్నుల యూరియాను జిల్లాకు రప్పించారు.
News September 5, 2025
ఉమ్మడి కృష్ణా నుంచి జాతీయ అవార్డులు పొందేది వీరే..!

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు అధ్యాపకులు జాతీయ స్థాయిలో ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు. మైలవరం లక్కిరెడ్డి హనుమ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి దేవానంద్ కుమార్, విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రొఫెసర్ విజయలక్ష్మి కాశీనాథ్ ఢిల్లీలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను అందుకోనున్నారు.
News September 4, 2025
కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని వినతి

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను కోరారు. మచిలీపట్నం పర్యటనకు వచ్చిన మాధవ్‌ను కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మాధవ్ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.