News March 13, 2025

కృష్ణా జిల్లాలో నేడు వడగాల్పులు

image

కృష్ణా జిల్లాలో గురువారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. జిల్లాలో పలు మండలాలకు హైఅలర్ట్ ప్రకటించింది. బాపులపాడు 40.7°, గన్నవరం 41.7, కంకిపాడు 40.6°, నందివాడ 40°, పెదపారుపూడి 40.4, పెనమలూరు 40.9°, ఉంగుటూరు 41.4°, ఉయ్యూరు 40.6° ఉష్ణోగ్రతలు ఉండనున్నట్లు చెప్పారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News September 11, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణా: ఈ నెల 13న లోక్ అదాలత్
☞ గరికపర్రులో జిల్లా జూడో జట్లు ఎంపిక
☞ ఉమ్మడి కృష్ణాలో 70 శాతం స్మార్ట్ కార్డుల పంపిణీ
☞ మచిలీపట్నం విజయవాడ హైవే ప్రమాదం.. స్పాట్ డెడ్
☞ కృష్ణా: పెరిగిన గోల్డ్ రేట్స్.. భయపెడుతున్న దొంగతనాలు
☞ చల్లపల్లి పాఠశాల అన్నంలో పురుగులు
☞ చేవేండ్రలో దొంగతనం

News September 11, 2025

కృష్ణా: ఒకేసారి 15 మందికి గవర్నమెంట్ జాబ్స్

image

కోడూరు మండలం జరుగువానిపాలెం గ్రామం ఆదర్శంగా నిలిచింది. చిన్న పల్లెటూరు నుంచి ఒకేసారి 15 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిలో 8 మంది అమ్మాయిలు, 7 మంది అబ్బాయిలు. ఇటీవల విడుదలైన డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో వీరు అర్హత సాధించారు. 11 టీచర్ పోస్టులు, 3 పోలీస్ ఉద్యోగాలు, ఒకరు సేల్స్ ట్యాక్స్‌లో నియామకం పొందారు.

News September 11, 2025

గరికపాడులో జిల్లా జూడో జట్ల ఎంపిక

image

తోట్లవల్లూరు మండలం గరికపాడు ప్రభుత్వ పాఠశాలలో అండర్-14, 17 జూడో జట్ల ఎంపికలు ఘనంగా జరిగాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శులు దుర్గారావు, శ్రీలత తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు కీర్తి తీసుకురావాలని వారు క్రీడాకారులను కోరారు.