News September 28, 2024

కృష్ణా జిల్లాలో పకడ్బందీగా పోలీస్ గస్తీ విధులు

image

కృష్ణా జిల్లాలో రాత్రి సమయాల్లో పకడ్బందీగా పోలీస్ గస్తీ విధులు నిర్వహిస్తున్నామని జిల్లా పోలీస్ యంత్రాంగం తమ అధికారిక ఖాతాలో శనివారం ట్వీట్ చేసింది. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది బీట్ పాయింట్స్ విస్తృతంగా తనిఖీ చేస్తున్నారని పేర్కొంది. ఏటీఎంలు, వ్యాపార సముదాయాల వద్ద పహారా కాస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పని చేస్తోందని ఈ మేరకు Xలో పోస్ట్ చేసింది.

Similar News

News November 6, 2025

కృష్ణా జిల్లాలోకి రానున్న కైకలూరు నియోజకవర్గం

image

ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గం త్వరలోనే కృష్ణా జిల్లాలోకి రానుంది. జిల్లాల మార్పుకై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం వెల్లడించిన వివరాల మేరకు.. ఈ మార్పుకై గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. దీంతో ఏలూరు డివిజన్‌లో ఉన్న కలిదిండి, కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, మండలాలు గుడివాడ రెవిన్యూ డివిజన్ కిందకు రానున్నాయి.

News November 5, 2025

పెడన: సైబర్ క్రైమ్ కేసు.. విశాఖపట్నంకు ఆరుగురి తరలింపు

image

విశాఖపట్నం సైబర్ క్రైమ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించిన ఆరుగురిని అధికారులు పెడనలో అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం విశాఖపట్నానికి తరలించారు. నిందితులపై పెడన పోలీస్ స్టేషన్‌లో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ అరెస్టులు, దర్యాప్తుతో పెడన ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

News November 4, 2025

కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు అసంబద్ధం: YS జగన్

image

కృష్ణా జిల్లాలో జగన్ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30న ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఒక్క రోజులోనే సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. 31 తర్వాత దరఖాస్తుకు కూడా అవకాశం లేదు. ఒక్కరోజులో పంట పొలాల్లోకి వచ్చి ఎన్యూమరేషన్ చేయటం అసాధ్యం అని జగన్ విమర్శించారు. అసలు ఎన్యూమరేషన్ అంటే చంద్రబాబుకు తెలుసో లేదో తెలుసుకోవాలని ఆయన ప్రశ్నించారు.