News February 18, 2025

కృష్ణా జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నేటి నుంచే పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయని, అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీలు నమోదయ్యే సూచనలు కన్పిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నిన్న మచిలీపట్నంలో 33 డిగ్రీలు నమోదు అయినట్లు తెలిపారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News February 21, 2025

మచిలీపట్నం: APK ఫైల్ క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ.!

image

ఆన్లైన్‌లో అనుమానాస్పద APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ కావొచ్చు అని ఎస్పీ ఆర్. గంగాధరరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అపరిచిత లింకులు, అనధికారిక యాప్‌ల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. 

News February 20, 2025

కృష్ణా: డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల పరిశీలన 

image

డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులతో సిద్ధం చేయాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన SPతో కలిసి కేంద్రాలను పరిశీలించారు. MLC ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి 27న నిర్వహించే పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సామాగ్రి పంపిణీకి మచిలీపట్నం నోబుల్ కాలేజ్, ఉయ్యూరు, గుడివాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల పరిధిలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

News February 20, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

1. MLC ఓటు చెక్ చేసుకోండి ఇలా. 2. గన్నవరం: బాలికల మిస్సింగ్.. ఛేదించిన పోలీసులు3. మచిలీపట్నం బ్యాంకులో దొంగతనం4. మచిలీపట్నం: ఉద్యోగం నుంచి ప్రిన్సిపల్ తొలగింపు5. గుడివాడ: విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి 6. M.Tech 1st సెమిస్టర్ టైం టేబుల్ విడుదల 7. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వంశీకి షాక్8. జిల్లా వ్యాప్తంగా MLC ఎన్నికల ప్రచారం9. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల పరిశీలన 

error: Content is protected !!