News May 12, 2024

కృష్ణా జిల్లాలో పోలింగ్ సర్వం సిద్ధం

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కృష్ణా జిల్లాలో పోలింగ్ నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొత్తం 1768 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహించనుండగా 15,39,460 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Similar News

News February 15, 2026

నాటి ‘కడలిపల్లే’ నేటి పెదకళ్లేపల్లి క్షేత్రం!

image

మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో కృష్ణా నది తీరాన ఉన్న శ్రీ నాగేశ్వరస్వామి ఆలయం అత్యంత ప్రాచుర్యమైన ఆలయాల్లో ఒకటి. దక్షిణకాశీగా పిలువబడే ఈ ఆలయం బౌద్ధుల కాలం నాటిదిగా చెబుతారు. బౌద్ధుల కాలంలో ఈ ప్రాంతాన్ని కడలిపల్లి అని పిలిచేవారు. ఈ ఆలయానికి ఉత్తరం వైపు కృష్ణానది ప్రవహించడం ఇక్కడి విశిష్టత. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.

News February 13, 2026

కృష్ణా: పాఠశాలలకు రెండో శనివారం సెలవు రద్దు.!

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు ప్రకటించిన రెండో శనివారం సెలవును జిల్లా విద్యాశాఖ అధికారులు అనూహ్యంగా రద్దు చేశారు. DEO సుబ్బారావు సర్క్యులర్ జారీ చేస్తూ, రేపు అన్ని ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా పనిచేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా జిల్లా పరిధిలోని MEO, DYEOలు తమ తమ మండలాల ప్రధానోపాధ్యాయులకు సమాచారాన్ని అందజేశారు.

News February 13, 2026

కృష్ణాజిల్లా MLAల ప్రోగ్రెస్ ఇదే

image

కృష్ణాజిల్లా MLAలతో CM చంద్రబాబు గురువారం సమావేశం అయ్యారు. MLAల పనితీరును బట్టి వారికి ప్రోగ్రెస్ రిపోర్టులు అందించారు. పనితీరులో పామర్రు ప్రథమ స్థానం, పెనమలూరు రెండో స్థానంలో ఉందన్నారు. నియోజకవర్గాల్లో జనసేన, BJP నేతలతో సమన్వయం పెంచాలన్నారు. అవనిగడ్డలో TDP, జనసేన మరింత కలిసి పనిచేయాలని సూచించారు. కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు చేరువగా పనిచేయాలని సూచించారు.